Header Banner

అమెరికాలో బీభత్సం.. 12 మంది మృతి! లక్షలాది ఇళ్లకు కరెంట్ కట్, ఇళ్లు ధ్వంసం!

  Wed May 21, 2025 13:43        U S A

మధ్య అమెరికాలోని పలు రాష్ట్రాలు టోర్నడోల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సోమవారం సంభవించిన నాలుగు శక్తివంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ వరకు విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. ఈ పెనుగాలుల ధాటికి అనేక భవనాలు కుప్పకూలగా, విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఓక్లహామా రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ఒక అగ్నిమాపక కేంద్రంతో పాటు కనీసం పది నివాస గృహాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 1,15,000 మంది ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక చీకటిలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది.

 

ఇది కూడా చదవండి: 175 బిలియన్ డాలర్లతో ట్రంప్ 'గోల్డెన్ డోమ్'.. చైనా, రష్యా ఆందోళన..

 

టోర్నడోల ప్రభావంతో పలు జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉత్తర టెక్సాస్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇక్కడ సుమారు 11.4 సెంటీమీటర్ల వ్యాసంతో కూడిన పెద్ద పెద్ద వడగళ్లు పడ్డాయని స్థానిక వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. మరోవైపు, సెయింట్ లూయిస్ నగరంలో టోర్నడోల వల్ల కనీసం 5,000 భవనాలు దెబ్బతిన్నాయని, దీనివల్ల సుమారు 1 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ముఖ్యంగా కెంటకీ రాష్ట్రం టోర్నడోల తాకిడికి తీవ్రంగా నష్టపోయింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇప్పటివరకు 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నష్టాన్ని అంచనా వేసే పనులు కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNewShip #NewShip #USANews #Travel #World #BigShip #Titanic #TitanicShip #TitanicBigShip